విజయ్ సాయి రెడ్డిపై సుప్రీంకోర్టు సిజెఐకి పురంధరీశ్వరి లేఖ...

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు. కుటుంబ రాజకీయమా? కులరాజకీయమా? అంటూ ప్రశ్నించారు. 

Purandhariswari letter to Supreme Court CJI on Vijay Sai Reddy - bsb

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పురందేశ్వరిపై ఎంపీ విజయసాయి మరోసారి సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ...తెలంగాణలో మీ మరిది కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో బీసీ నాయకుడు పార్టీకి రాజీనామా చేశాడని అన్నారు. 

‘తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిస్తున్న టిడిపికి ఏపీలో మీరు నేరుగా మద్దతిస్తున్నారు. మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటీల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే రాజకీయమా? అంటూ చురకలంటించారు. ఈ ట్వీట్ తరువాత పురంధేశ్వరి భిన్నంగా స్పందించారు. 

విజయ్ సాయి రెడ్డిపై సుప్రీంకోర్టు సిజెఐకి పురంధరీశ్వరి లేఖ రాశారు. విజయ్ సాయి రెడ్డి పదేళ్లుగా బెయిల్ పై కొనసాగుతూ సిబిఐ, ఈడి కేసుల విషయంలో షరతులు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఏపీలో ఈ పోటాపోటీ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. 

11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి. విజయ్ సాయి రెడ్డి విధాన పరమైన అంతరాలను పదే పదే వాడుకుంటున్నారు. విచారణను వాయిదా వేయించుకుంటూ.. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని.. దీనిమీద తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios