టార్గెట్ చంద్రబాబే: జగన్ పార్టీలోకి పురంధేశ్వరి ?

purandeshwari to join YSRCP
Highlights

మచిలీపట్నం లేదా విజయవాడ లోకసభ స్థానం నుంచి పురంధేశ్వరి 

మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆమె బిజెపిలో కొనసాగడం వల్ల ఫలితం లేదని బావించినట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెసులో చేరుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం లేదా విజయవాడ లోకసభ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

దానివల్ల పార్టీకి కూడా లాభం చేకూరుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. పురంధేశ్వరి ప్రధాన లక్ష్యం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని అంటున్నారు. అందుకు మచిలీపట్నం లేదా విజయవాడ స్థానాల నుంచి పోటీ చేస్తే తాను ఎన్టీఆర్ కూతురిగా తనకు ప్రజలు విజయాన్ని చేకూర్చి పెడుతారని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెసు ఎక్కువ శాసనసభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉంటాయన అనుకుంటారు. పురంధేశ్వరి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో విరివిగా చక్కర్లు కొడుతోంది.

loader