పులివెందుల:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శేఖర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు గురువారం నాడు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వివేకానంద రెడ్డి వాచ్‌మెన్ రంగయ్యకు కూడ నార్కో అనాలిసిస్ టెస్ట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఈ ఏడాది మార్చి 14వ తేదీ రాత్రిన హత్యకు గురయ్యారు.  ఈ హత్యపై వైఎస్ జగన్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

ఈ సిట్  వివేకానందర్ రెడ్డి హత్య కేసును వేగవంతం చేసింది.  ఇటీవల ఈ కేసులో అనుమానితులను సిట్ బృందం విచారించింది. అంతేకాదు వాచ్‌మెన్ రంగయ్యను కూడ పోలీసులు విచారించారు. రంగయ్యకు  నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది.

అయితే ఇదే కేసులో  రౌడీ షీటర్  శేఖర్ రెడ్డికి కూడ నార్కో అనాలిసిస్  టెస్టులు నిర్వహించేందుకు పులివెందుల కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది.  ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు శేఖర్ రెడ్డికి నార్కో ఎనాలిసిస్  పరీక్షలు నిర్వహణకు కోర్టు అనుమతి ఇచ్చింది.