Asianet News TeluguAsianet News Telugu

ఏం త‌ప్పు చేశాడు.. క‌డుపు ర‌గిలిపోతోంది.. : చంద్రబాబు అరెస్టు పై ఆవేశంతో ఊగిపోయిన బండ్ల గణేష్

Bandla Ganesh: "మ‌నంద‌రికీ భ‌విష్య‌త్తు ఇచ్చినందుకు చంద్ర‌బాబు జైల్లో ఉండాలా? ఏం మాట్లాడాడు.. ఏం త‌ప్పు చేశాడు.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు గురించి ప్ర‌స్తావిస్తూ న‌టుడు, నిర్మాత బండ్ల ఆవేశంతో ఊగిపోయారు. చంద్ర‌బాబు అరెస్టును ఖండిస్తూ క‌న్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 
 

Producer Bandla Ganesh shed tears talking about TDP national president N. Chandrababu Naidu RMA
Author
First Published Oct 30, 2023, 12:51 AM IST

Hyderabad: "మ‌నంద‌రికీ భ‌విష్య‌త్తు ఇచ్చినందుకు చంద్ర‌బాబు జైల్లో ఉండాలా? ఎం చేశాడు, ఏం మాట్లాడాడు, ఏం త‌ప్పు చేశాడు.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు గురించి ప్ర‌స్తావిస్తూ న‌టుడు, నిర్మాత బండ్ల ఆవేశంతో ఊగిపోయారు. చంద్ర‌బాబు అరెస్టును ఖండిస్తూ క‌న్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే..  హైద‌రాబాద్ న‌గ‌రంలో సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏండ్లు పూర్త‌యిన క్ర‌మంలో సాప్ట్ వేర్ ఉద్యోగులు గచ్చిబౌలి స్టేడియంలో ఒక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనిని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా నిర్వ‌హించగా, టీడీపీ నాయ‌కుల‌తో పాటు అనేక మంది ప్ర‌ముఖులు కూడా పాలుపంచుకున్నారు. అలాగే, ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలుగు ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబు పాల‌న‌లో చేసిన అభివృద్ధినీ, ముఖ్యంగా ఐటీ ప‌రిశ్ర‌మ ఎదుగుద‌ల‌ను ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు.

ఏం త‌ప్పు చేశార‌ని చంద్ర‌బాబు అరెస్టు చేశార‌ని ప్ర‌శ్నించిన బండ్ల గ‌ణేశ్.. బాబు కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికైనా తాను సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. దేశ‌విదేశాల్లో చంద్ర‌బాబుకు జై కొడుతుంటే.. రాజ‌మండ్రిలో జైల్లో ఉండ‌టంతో క‌డుపు ర‌గిలిపోతున్న‌ద‌ని క‌న్నీరు పెట్టుకున్నారు. చంద్ర‌బాబు కోసం తాను చావ‌డానికైనా సిద్ధ‌మ‌నీ, త‌న ఆయుష్షును ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. చంద్ర‌బాబు సేవ‌లు దేశానికి అవ‌స‌ర‌ని కొనియాడారు. ప్ర‌పంచ దిగ్గ‌జ నాయకులు చంద్ర‌బాబు పై ప్ర‌శంస‌లు కురిపించార‌ని పేర్కొన్న బండ్ల గ‌ణేశ్.. చంద్ర‌బాబు తెలుగు వాడిగా పుట్ట‌డం నేర‌మా అని ప్ర‌శ్నించారు. త‌మిళ‌నాడులోనూ, గుజరాత్ లోనూ, మ‌హారాష్ట్రలోనూ పుట్టివుంటే చంద్ర‌బాబును ఆకాశంలో పెట్టుకుని చూసుకునే వార‌ని అన్నారు. ఆయ‌న సేవ‌ల‌ను ఈ ప్ర‌పంచం ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌ని పేర్కొన్నారు. ద‌మ్మున్నోడు.. ధైర్య‌మున్నోడు, నీతిమంతుడు.. మోన‌గాడు చంద్ర‌బాబు అంటూ బండ్ల గ‌ణేశ్ ఆవేశంతో ఊగిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios