Asianet News TeluguAsianet News Telugu

ఇది హిందువుల విజయం: టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదంపై వీర్రాజు స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంపై స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని వీర్రాజు పేర్కొన్నారు.

proddatur tipu sultan statue issue this is hindus victory says ap bjp chief somu veerraju ksp
Author
kadapa, First Published Aug 3, 2021, 5:01 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలను భగ్నమయ్యాయని ఆయన అన్నారు. బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని వీర్రాజు పేర్కొన్నారు. ఇది, హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయమని సోము వీర్రాజు అన్నారు

Also Read:ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వద్దంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ..

కాగా,  ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇటీవల భూమి పూజ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ కూడా విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం దీనిపై అభ్యంతరం తెలుపుతూ విగ్రహం ఏర్పాటుకు నిరాకరించారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై బీజేపీ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios