Asianet News TeluguAsianet News Telugu

ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వద్దంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ..

ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలు చేశాడని... వీటిని భగ్నం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ బిజెపి విభాగం చేసిన పోరాటాల ఫలితాలనిచ్చింది.

AP government has said no to the setting up of a statue of Tipu Sultan in Proddatur
Author
Hyderabad, First Published Aug 3, 2021, 2:13 PM IST

అమరావతి : ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నో చెప్పింది. అక్కడ ఏ విగ్రహమూ ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలు చేశాడని... వీటిని భగ్నం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ బిజెపి విభాగం చేసిన పోరాటాల ఫలితాలనిచ్చింది. ఆ ప్రాంతంలోఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే, తీవ్రమైన చర్యలను తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇది, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయం అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, భారత ప్రభుత్వం యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 

దేశంలో నివసించే ఎవరైనా, భారత రాజ్యాంగాన్ని పాటించాలని, కాదని రాచమల్లు రాజ్యాంగం.. పాటిస్తామంటే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయని ఎద్దేవా చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే మీద, ఇతర నిర్వాహకుల మీద తక్షణం పోలీసులు కేసు నమోదు చేయాలని ఏపి బీజేపీ డిమాండ్ చేస్తోందని యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios