గుంటూరు జిల్లా లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై రొంపిచర్ల శివారులోని తంగళ్లపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ సబ్బు పల్టీ కొట్టింది. వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో బస్సులో ఉన్న 40 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. 

దీంతో స్థానికులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. బస్సులో 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీస్తున్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి కందుకూరు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.