తాజా రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో చంద్రబాబునాయుడుకు ప్రదానమంత్రి నరేంద్రమోడి ఫోన్ చేశారు. కేంద్ర మంత్రివర్గం నుండి టిడిపి మంత్రులు వైదొలుగుతున్న నేపధ్యంలో మోడి ఫోన్ చేయటం ప్రాధాన్యత సంతరించుకున్నది. రాజీనామా చేయాలన్న నిర్ణయానికి కారణాలను ప్రధాని చంద్రబాబును అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా ప్రధానికి కారణాలను వివరించారట. కేంద్రమంత్రివర్గంలో ఉండి ఉపయోగం లేనపుడు రాజీనామాలు చేయటమే మేలని చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.