చట్టసభల విలువలను కాపాడాల్సిన సభాపతులే అమ్ముడుపోతే ఇక విలువలు ఎవరు కాపాడుతారని ఘాటుగానే నిలదీసారు.

సభాపతులు అమ్ముడుపోయారా? ఎంతమాటన్నారు కాంగ్రెస్ ఎంఎల్సీ సి. రామచంద్రయ్య. చట్టసభల విలువలను కాపాడాల్సిన సభాపతులే అమ్ముడుపోతే ఇక విలువలు ఎవరు కాపాడుతారని ఘాటుగానే నిలదీసారు. ఇంతకీ రామచంద్రయ్యకు ఎందుకు అంత కోపమొచ్చిందో మాత్రం తెలీదు. ఒక పార్టీ టిక్కెట్టుపై గెలిచిన సభ్యులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో ఎలా కూర్చుంటారని తీవ్రంగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ, మండలిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోయారు. అందుకే ప్రిసైడింగ్ అధికారుల అధికారాలను రివ్యూ చేసే అధికారాలు ఎన్నికల కమీషన్, పార్లమెంట్ స్పీకర్ కు ఇవ్వాలని రామచంద్రయ్య డిమాండ్ చేసారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాస్తున్నట్లు కూడా చెప్పారు.