ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 34 ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్స్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయంపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 34 ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్స్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయంపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు ఉన్న పాఠశాలల్లో అంగన్‌వాడీలను విలీనం చేయాలని తెలిపారు.
Also Read:మేం పరీక్షలు పెడతాం... మీరు కూడా పెట్టండని కేంద్రాన్ని కోరాం: ఏపి విద్యాశాఖ మంత్రి సంచలనం
నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు జగన్ దిశా నిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలని.... పాఠశాలలన్నీ 3 కి.మీ దూరంలో అందుబాటులో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. టీచర్ల బోధనా సామర్థ్యానికి తగినట్లుగా హేతుబద్ధీకరణ చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఫౌండేషన్ స్కూళ్ల తర్వాత డిజిటల్ బోధనపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
