వైద్యుల నిర్లక్ష్యం.. కూర్చున్న చోటే ప్రసవించిన గర్భిణి.. !!
విశాఖపట్నంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు గర్బిణికి ఇక్కట్లు తెచ్చిపెట్టింది. కరోనా పేరుతో నిండు గర్భిణీ అని కూడా చూడకుండా వేచి చూసేలా చేసిన కాఠిన్యం ఆమెను నడిరోడ్డుమీదే ప్రసవించేలా చేసింది.

వివరాల్లోకి వెడితే... అడవి వరం ఆరోగ్య కేంద్రానికి ప్రసవం నిమిత్తం ఓ నిండు గర్బిణీ వచ్చింది. అయితే కరోనా టెస్ట్ కోసం అంటూ ఆమెను ఆస్పత్రి బయటై ఉంచేశారు.
నొప్పులు ఎక్కువవుతున్నాయని చెప్పినా టెస్టుల తరువాతే అంటూ పట్టించుకోలేదు. దీంతో ఆ గర్బిణీ ఆస్పత్రి బయటే ప్రసవించింది. నడిరోడ్డు మీదే బిడ్డకు జన్మనిచ్చింది. కూర్చున్న చోటే.. కూర్చునే బిడ్డను కన్నది.
దీంతో చుట్టుపక్కల ఉన్నవారు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మీద తీవ్రంగా మండిపడ్డారు. గర్బిణీకి కాన్పు సమయంలో ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని విమర్శించారు.