క్రిష్ణాజిల్లా, తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నమహిళా కానిస్టేబుల్ జువ్వలపూడి కోమలి కరోనాతో మృతి చెందింది. కోమలి 6 నెలల గర్భిణీ కావడంతో మరింత విషాదకరంగా మారింది. 

కోమలికి 8 వతేదీ కొవిడ్ సోకగా.. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో 13 వతేదీ టైమ్ హాస్పటల్ లో అడ్మిట్ అయింది. అప్పటినుంచి కరోనాతో పోరాడుతున్న కోమలి శనివారం  టైం ఆస్పత్రిలోనే  తుది శ్వాస విడిచింది. 

కోమలి స్వస్థలం ఘంటసాల మండలం కొడాలి గ్రామం. 8 నెలల క్రితమే  వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరునెలల గర్భిణి.

కోమలి మరణవార్త తెలిసి డీసీపీ హర్షవర్ధన్ రాజు, సిఐ నాగప్రసాద్ లు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే కరోనా తో తోట్ల వల్లూరు ఎస్సై కిషోర్ బాబు సన్ రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్పుడు కోమలి మరణంతో తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు.