Asianet News TeluguAsianet News Telugu

ఎగ్జిట్ పోల్ ఫలితాలు: వైఎస్ జగన్ హ్యాపీ

శాసనసభ ఎన్నికల్లో వైసిపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని, లోకసభ ఎన్నికల్లో టీడీపి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలుతెలియజేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో జోష్ లో ఉంది.

Predictions paint a happy picture for Jagan
Author
Amaravathi, First Published May 20, 2019, 7:59 AM IST

అమరావతి: ఒక్క ఏజెన్సీ తప్ప మిగతా ఏజెన్సీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తుందని తేల్చాయి. శాసనసభ ఎన్నికల్లో వైసిపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని, లోకసభ ఎన్నికల్లో టీడీపి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలుతెలియజేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో జోష్ లో ఉంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిపిఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం... తెలుగుదేశం పార్టీకి 37, వైసిపికి 130 నుంచి 133 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయి. ఐన్ న్యూస్- ఐ పిల్స్ సర్వే ప్రకారం... టీడీపికి 55 నుంచి 62 సీట్లు, వైసిపికి 110 నుంచి 120 సీట్లు, జనసేనకు 3 సీట్లు వస్తాయి. విడీపి అసోసియేట్స్ సర్వే ప్రకారం... టీడీపికి 54 నుంచి 60, వైసిపికి 111 నుంచి 121 సీట్లు, జనసేనకు 0 నుంచి 4 సీట్లు వస్తాయి. 

ఐన్ఎస్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం... టీడీపికి 118, వైసిపికి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయి. ఎలైట్ సర్వే ప్రకారం... టీడీపికి 106 సీట్లు, వైసిపికి 68 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయి. టీడీపికి 49, వైసిపికి 116, జనసేనకు 2 సీట్లు వస్తాయని పోల్లాబ్ ఎగ్దిట్ పోల్ సర్వే తేల్చింది. 

టీడీపికి 47, వైసిపికి 126, జనసేనకు 2 సీట్లు వస్తాయని ఆరా సర్వే తేల్చింది. కేకే సర్వే ప్రకారం... టీడీపికి 30 నుంచి 35 సీట్లు, వైసిపికి 130 నుంచి 135 సీట్లు, జనసేనకు 10 నుంచి 13 సీట్లు వస్తాయి. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం... టీడీపికి 58, వైసిపికి 98, జనసేనకు 7 సీట్లు వస్తాయి.

లోకసభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలోని 25 స్థానాల్లో వైసిపికి 18 నుంచి 20 స్థానాలు వస్తాయని ఇండియా టుడే - ఆక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీకి 4 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. వైసిపికి 45 శాతం ఓట్లు వస్తాయని, టీడీపికి 38 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. 

టైమ్స్ నౌ - విఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.... వైసిపికి 18 లోకసభ స్థానాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ 7 స్థానాలకే పరిమితమవుతుంది. బిజెపి తన రెండు సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. న్యూస్ ఎక్స్, ఇండియా న్యూస్, మైనేత సర్వేలు వైసిపికి 20 స్థానాలు, టీడీపికి 5 స్థానాలు వస్తాయని తేల్చాయి. 

న్యూస్ 18కు చెందిన ఐపిఎస్ఓఎస్ సర్వే ప్రకారం... వైసిపికి 13 నుంచి 14 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయి. రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు, వైసిపికి 13 నుంచి 16 సీట్లు వస్తాయి. న్యూస్ 24 - టుడేస్ చాణక్య సర్వే ప్రకారం... తెలుగుదేశం పార్టీకి 17 సీట్లు, వైసిపికి 8 సీట్లు వస్తాయి.

మొత్తంమీద, ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు వైఎస్ జగన్ కు అనుకూలంగా వచ్చాయి. దీంతో అంతిమ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని జగన్ భావిస్తున్నారు. దీంతో వైసిపి శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios