Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి

చట్ట విరుద్ధమైన జల్లికట్టును తమిళనాడు సాధించుంకున్నపుడు ఏపికి ప్రత్యేకహోదా మాత్రం కేంద్రం ఎందుకు ఇవ్వటం లేదని  ప్రజల్లో చర్చ మొదలైంది.

preasure mounting on Naiu

ఉరుము ఉరిమి మంగళం మీద పడిందనేది ఓ సామెత. తమిళనాడుతో పోలిక వల్ల చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది ఎక్కడో తమిళనాడులో జల్లికట్టును నిషేధించటమేమిటి? మళ్ళీ అనుమతి ఇచ్చే దిశగా కేంద్రం దిగిరావటమేమిటి? నిషేధానికి-దిగిరావటానికి మధ్య ఏమి జరిగింది? ఉవ్వెత్తున లేచిన ఉద్యమం. జల్లికట్టుకు అనుకూలంగా మొత్తం తమిళనాడు అంతా ఏకమైపోయింది. దాంతో బిత్తరపోయిన కేంద్రం దిగివచ్చింది.

 

అదే అంశం ఇపుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. చట్ట విరుద్ధమైన జల్లికట్టును తమిళనాడు సాధించుంకున్నపుడు ఏపికి ప్రత్యేకహోదా మాత్రం కేంద్రం ఎందుకు ఇవ్వటం లేదని  ప్రజల్లో చర్చ మొదలైంది. జల్లికట్టు కోసం తమిళనాడులో పార్టీలన్నీ ఏకమవటం ప్రజలను ఆకట్టుకుంది. దాంతో ప్రత్యేకహోదా సాధన కోసం చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.

 

జల్లికట్టుతో పోల్చుకుంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా చాలా అవసరం. పైగా రాష్ట్ర విభజన చట్టంలోనే ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ తదదితర అంశాలున్నాయి. అయినా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏమాత్రం ఖాతరు చేయలేదు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లోని అనైక్యత, ప్రజల్లో అచేతనత్వం, రాజకీయావసరాలకు చంద్రబాబు కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్ధితి వల్ల కేంద్రం రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు.

 

వ్యక్తిగత అవసరాలకోసం కేంద్రంతో రాజీపడినా చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదు. అదే ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ రాకుంటే రాష్ట్రం, ప్రజలు దారుణంగా నష్టపోవటం ఖాయం. ఈ విషయాలు తెలిసి కూడా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలుకున్నారు. రాజకీయంగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం ఎంతటి బలహీనుడో ఎవ్వరినడిగినా చెబుతారు.

 

బలహీనుడనుకుంటున్న పన్నీర్ శెల్వమే జల్లికట్టుకు అనుమతులు సాధించినపుడు ఎంతో చంద్రబాబు ప్రత్యేకహోదాను ఎందుకు సాధించలేకపోతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్నాయి. వైసీపీ ఆందోళనలు చేసినపుడు చంద్రబాబుతో పాటు అధికార పార్టీ నేతలెందరో జగన్ను అవహేళనగా మాట్లాడటం గమనార్హం. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు జల్లికట్టును ప్రస్తావిస్తూ చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా రాసారు. దావోస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios