Asianet News TeluguAsianet News Telugu

ప్రీ పోల్ సర్వే: జగన్ దే హవా, బాబుకు చుక్కలే

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్‌ సంస్థ జరిపిన ప్రీ పోల్ సర్వేలో తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్‌ టీవీ ప్రసారం చేసింది. 

Pre poll survey: YS Jagan will win majority seats
Author
Amaravathi, First Published Oct 5, 2018, 7:37 AM IST

అమరావతి: ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాన్ని సీ - ఓటరు ప్రీ పోల్ సర్వే తేల్చింది. జగన్ హవా కొనసాగుతుందని, చంద్రబాబుకు ఎదురు దెబ్బ తప్పదని ఆ సర్వే తేల్చింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్‌ సంస్థ జరిపిన ప్రీ పోల్ సర్వేలో తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్‌ టీవీ ప్రసారం చేసింది. 

ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బ తింటుందని సెప్టెంబర్‌ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది.  వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీ చేస్తే ఎపిలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి 21 సీట్లు, టీడీపీకి 4 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.

బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక్క సీటు కూడా రాదని తేల్చింది. ఓట్ల శాతం చూస్తే... వైఎస్సార్‌సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వివరించింది. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. 

సంబంధిత వార్త

ప్రీ పోల్ సర్వే: టీఆర్ఎస్ కు 9, కాంగ్రెసుకు 6, టీడీపి మటాష్

Follow Us:
Download App:
  • android
  • ios