Asianet News TeluguAsianet News Telugu

జీతాలు రాకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది: ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు


తమకు ఈ నెల వేతనాలు రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పీఆర్సీ సాధన సమితి బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. పీఆర్సీ సాధన సమితి నేతలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

PRC Struggle Committee leader Bopparaju Venkateshwarlu serious Comments on AP Government
Author
Guntur, First Published Jan 26, 2022, 3:30 PM IST


అమరావతి: తమకు ఈ నెల జీతాలు రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీ పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.PRC సాధన సమితి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నాడు Ambedkar  విగ్రహనికి వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  జీతాలు రాకపోతే Employees నేతలపై తిరగబడుతారని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.

Salaries రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.పీఆర్సీ సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులంతా ఉద్యమంలో ఉండగా ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరమీదికి తెచ్చిందని ఆయన విమర్శించారు. 

సమ్మెకు వెళ్లే వరకు New Districts ఏర్పాటు ప్రక్రియ సహా తమ విధులు మేం నిర్వహిస్తామన్నారు.కొత్త జిల్లాల ప్రక్రియకు సంబంధించి చేయాల్సినంత వేగంగా పనిచేస్తామన్నారు.అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని ఆయన కోరారు. పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులు దిద్దుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నెల 24న పీఆర్సీ సాధన సమితి నేతలు ఏపీ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ  శశిభూషణ్ కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుండి సమ్మెలోకి వెళ్తామని నోటీసులు ఇచ్చారు.

పీఆర్సీ విషయంలో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని సమ్మె నోటీసులో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని కూడా ఎంప్లాయిస్ డిమాండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios