Asianet News TeluguAsianet News Telugu

పీఆర్సీపై ఏపీ ఉద్యోగ సంఘాల కీలక ప్రకటన: ఫిబ్రవరి 7 నుండి సమ్మెలోకి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నాయి.  ఈ ఏడాది ఫిబ్రవరి ఏడవ తేదీ నుండి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాయి.

PRC AP Employee leaders decided to  go strike from February 7
Author
Guntur, First Published Jan 21, 2022, 3:13 PM IST


అమరావతి: ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుండి Strike కు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. PRC విషయమై Employees Union సంఘాలు ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును ఇవ్వాలని నిర్ణయించాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో కార్యాలయంలో  ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు భేటీ అయ్యారు.ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె Notice ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఫిబ్రవరి 5 నుండి సహాయ నిరాకరణ చేయనున్నారు. ఫిబ్రవరి 7 నుండి సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.

 సమ్మె నోటీసు కంటే ముందే  పాత జీతాలే ఇవ్వాలని ఇవాళ Chief Secretary ను కోరనున్నారు. సమ్మెకు ఉద్యోగులను సమాయత్తపర్చేందుకు గాను ఉద్యోగ సంఘాలు కార్యాచరణను సిద్దం చేస్తున్నాయి. ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాయి. ఈ నెల 25న ర్యాలీలు నిర్వహించనున్నారు. అదే రోజున ధర్నాలు కూడా చేపట్టనున్నారు. ఈ నెల 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు రిలే నిరహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

మరో వైపు ఉేద్యోగ సంఘాలు సమ్మె కు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును కూడా ఇవ్వనున్నాయి. ఈ విషయమై  ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ట్రాప్ లో పడుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలతో తమకు వేతనాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విబేధిస్తున్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం 98 వేల కోట్ల నుండి 62 వేల కోట్లకు పడిపోయిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని కూడా సీఎస్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేలా జీవోలు జారీ చేశామన్నారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios