గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్  కిశోర్ టీమ్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు ఈ కార్యక్రమంపై ఇంట్రెస్ట్ చూపలేదని తేలింది.  

గడప-గడపకు కార్యక్రమంపై (gadapa gadapaku mana prabhutvam) సీఎం వైఎస్ జగన్ (ys jagan) సమక్షంలో ఐప్యాక్ టీం (ipac team) ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పని తీరుపై తెలియజేసింది. ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు నిర్వహించారన్న దానిపై ప్రజంటేషన్‌లో ప్రస్తావించారు. 10, 5 రోజుల కంటే తక్కువ గడప- గడపకు నిర్వహించిన వారిపై ఐప్యాక్ నివేదిక ఇచ్చింది. ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలు వున్నట్లు తెలిపిందింది. ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనని వారిలో బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వున్నారు. 

అనంతరం ఈ నివేదికపై సమావేశంలోనే స్పందించారు సీఎం జగన్. మొదటి నెల కావడంతో వదిలేస్తున్నానని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని సూచించారు. 6 నెలల వరకు ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ ఉంటుందని జగన్ అన్నారు. 6 నెలల తరువాత నివేదికను బట్టి చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. మరోవైపు.. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం జగన్‌కు పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Also Read:గడప గడపకూ మన ప్రభుత్వం : ఒక్కటంటే ఒక్కింటికీ వెళ్లని ఏడుగురు ఎమ్మెల్యేలు... క్లాస్ తీసుకున్న జగన్

కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఇళ్లకు వెళ్లకుండా ప్రతినిధులతో కార్యక్రమాన్ని నడిపించినట్లు జగన్ తెలిపారు. అందరూ స్వయంగా గడప గడపకూ వెళ్లాలని జగన్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. పనితీరును మెరుగు పరచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని మరోసారి హెచ్చరించారు. చీఫ్ విప్ ప్రసాదరాజు అందరికంటే మంచి పనితీరు కనబరిచినట్లు ఈ సమావేశంలో చెప్పారు. 90 శాతానికి పైగా హామీలను అమలు చేశామని.. వంద శాతం చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. చేయలేకపోవడం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

కాగా.. బుధవారం నాడు Tadepalli లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ లో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై సీఎం జగన్ ప్రజా ప్రతినిధులకు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా ఈ కార్యక్రమం జరిగిందనే విషయమై చెప్పిన ఆయన.. ఏ ప్రజా ప్రతినిధి పనితీరు ఎలా ఉంది, ఏ విషయంలో మెరుగు పడాలనే విషయాలపై దిశా నిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 8 మాసాలు జరుగుతుందని చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తీరాలని జగన్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఈ దిశగా కష్టపడాలని సూచించారు. 175 అసెంబ్లీ స్థానాలు సాధించడమే మన లక్ష్యమన్నారు. ఇది కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని అనుకున్నామా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నామా అని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కష్టపడితే రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించవచ్చన్నారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గపడకు కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు.