Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్, చంద్రబాబు లకు ఆ దమ్ము లేదు... నేనయితే డైరెక్ట్ ప్రధానితోనే..: కేఏ పాల్  

ప్రజాశాంతి పార్టీ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని... తాను మాత్రం విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు. 

Prajashanti Party contest in 175 seats in Andhra pradesh .... KA Paul
Author
First Published Nov 16, 2023, 2:57 PM IST

విశాఖపట్నం : తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పై పడ్డాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని పాల్ ప్రకటించినా ఎన్నికల కమీషన్ మాత్రం ఆ పార్టీకి గుర్తింపుపొందిన పార్టీగా పరిగణించలేదు. దీంతో పోటీనుండి తప్పుకున్న కేఏ పాల్ తిరిగి ఏపీ రాజకీయాలపై ద‌ృష్టిపెట్టారు. 

తెలంగాణలో పరిస్థితే ఆంధ్ర ప్రదేశ్ లో రాకుండా వుండేలా పాల్ జాగ్రత్తపడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయిన కేఏ పాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజాశాంతి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. తాను మాత్రం ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. 

విశాఖపట్నంలోని ప్రజాశాంతి కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసినా ప్రజలు ఓడిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోంది... ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, స్మార్ట్ సిటీలు, నిధులు ఏ విషయంలోనూ న్యాయం  చేయలేదని అన్నారు. కాబట్టి విశాఖ అభివృద్ది బాధ్యత తాను తీసుకుంటానని... తనను లోక్ సభ ఎన్నికల్లో  ఎంపీగా గెలిపించాలని కేఏ పాల్ కోరారు. 

Read More  తెలంగాణ ఎలక్షన్స్ నుండి టిడిపిని సైడ్ చేసిందే పురంధీశ్వరి... ఎందుకో తెలుసా? : విజయసాయి సంచలనం

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లకు ప్రధాని మోదీని ఢీకొనే దమ్ములేదని అన్నారు. కాబట్టి తాను గెలిస్తే ప్రధానిని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను ఆపుతానని అన్నారు. చారిటీ ద్వారానే ప్రజలకు ఎంతో చేసారు... మరి తానే ఎంపీ అయితే ఇంకెంత చేస్తానో విశాఖ ప్రజలు ఆలోచించాలని  కేఏ పాల్ సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios