విశాఖ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుంటే బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఒక్క మంత్రికే స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలేశారు. క్యాబినెట్ విస్తరణ తర్వాత గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు విశాఖ వస్తే, అయ్యన్న పాత్రుడికే స్వాగతం పలుకుతూ ఫెక్సీలేయడం దూమారం రేపుతూ ఉంది. దీని భావమేమిటనేది ఇపుడు విశాఖలో జోరుగా నడుస్తున్న చర్చ. గంటాను ఆయన ఎందుకు విస్మరించారు? ఇందులో రాజకీయామేమిటి?
బిజెపి శాసన సభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు అయ్యన్న పాత్రుడు వర్గంలోచేరిపోయాడా... ఇదే నిన్న వైజాగంతా చర్చ. ఎందుకంటే, క్యాబినెట్ విస్తరణ తర్వత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు వైజాగ్ తిరిగొస్తున్న సందర్భంగా అభిమానులంతా వూరంతా పోస్టర్లు ఫ్లెక్సీలు తెగ తగిలించేశారు.
ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లను బట్టి కార్యకర్తులు తాము ఎవరి గ్రూపులో ఉన్నారో, తమ నాయకుడెవరో వ్యక్తం చేస్తుంటారు. నాయకులు కూడా ఎవరు ఎంత పెద్ద హోర్డింగ్ నిలబెట్టారు, ఎన్ని పోస్టర్లు వేశారు, స్వాగతం వూరేగింపుకి ఎంత మందిని తీసుకువచ్చారనే దాన్నిబట్టి ఎవరు తమకు ముఖ్యమయిన వారెవరో తెల్చుకుంటారు. ఎవరు తన గ్రూపు వారో, ఎవరు ఎగస్పార్టీయో తేల్చుకుని ఆ ప్రకారం పనులు చేస్తూ పోతుంటారు.
విశాఖ నుంచి గంటా, అయ్యన్న పాత్రుడు ఇద్దరు మంత్రులున్నారు. వీరిద్దరు ఎంత తగవులాడుకుంటుంటారో తెలిసిందే. అంతలోనే షేక్ హ్యాండ్ ఇచ్చకుంటారు అదే వేరేవిషయం. ఎవరి గ్రూప్ వారికుంది. వారి సైన్యం వారికుంది.
అయితే, బిజెపి విష్ణుకుమార్ రాజు కూడా టిడిపి గ్రూపు రాజకీయాలలో చేరిపోయినట్లున్నారు. ఆయన అయ్యన్న పాత్రుడు మద్దతుదారు అని ఈ పోస్టర్ చెబుతుంది. అయ్యన్న పాత్రుడు, గంటా వైజాగ్ వచ్చిన సందర్భంగా వేసిన పోస్టర్ ఇది.ఇద్దరు మంత్రులు కలసి వస్తున్నపుడు,కలసి వూర్లో వూరేగుతున్నపుడు విష్ణుకుమార్ రాజు ఒక్క అయ్యన్న పాత్రుడికే స్వాగతం పలకడం ఏమిటబ్బాఅనేది నగర బిజెపి వర్గాలతో పాటు టిడిపిలో కూడా చర్చ గా మారింది.
వైజాగ్ లో ఇపుడు సన్స్ ఆప్ ది సాయిల్ (భూమిపుత్రుడు) చర్చ మళ్లీ వూపందుకుంది. బయటి వాళ్లొచ్చి ఇక్కడ పెత్తనం ఛలాయిస్తున్నారని చాలా మందిలో అసంతృప్తి వుంది. విశాఖ మునిసిపల్ ఎన్నికల్లో మేయర్ గా లోకల్ ని గెలిపించుకోవాలన్నది బిజెపి ఆశ అట. అందుకే ఈ సీటు తమకు కేటాయించాలని బిజెపి కోరుతూ ఉంది. గంటా శ్రీనివాస్ ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి వైజాగ్ బాగా బలపడ్డాడని కొందరి వాదన .ఆయన పెత్తనం కొనసాగితే, మేయర్ ని కూడా ఎవరో నెల్లూరు వాడినో, ప్రకాశం వాడినో నిలబెడతాడని భయమట. అందుకని ఆయన స్థానికుడయిన అయ్యన్న చేతులు కలిపి బయటి వాళ్లకు అడ్డు కట్ట వేసి స్థానికుడిరు గెలిపించుకోవాలనే వ్యూహంలో ఈ పోస్టర్ భాగమట.
విష్ణుకుమార్ రాజు అయ్యన్న పాత్రుడికి మాత్రమే స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఫ్లెక్సీలు తగిలించడం వెనక ఈ వాదన ఉందని చాల ామంది నమ్ముతున్నారు.
