విజయవాడ: విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజ పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి. దివ్య గొంతుపై బలమైన గాయం వల్లే  ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు.

దివ్య కడుపులో కూడ రెండు అంగుళాల మేర కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. చేతిపై కూడ గాయాలను వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

also read:దివ్యతేజ మృతికి కారణమిదీ: పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు

ఈ నెల 15వ తేదీన దివ్యతేజపై నాగేంద్రబాబు అలియాస్ స్వామి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

తాము పెళ్లి చేసుకొన్నామని నాగేంద్రబాబు మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  ఇద్దరం చనిపోవాలని భావించి కత్తితో కోసుకొన్నామని ఆయన చెప్పారు.

అయితే నాగేంద్రబాబు వాదనతో దివ్య తల్లిదండ్రులు ఏకీభవించలేదు. తమ కూతురిని పథకం ప్రకారంగా నాగేంద్రబాబు చంపాడని  వారు ఆరోపించారు. తమ కూతురిని చంపినట్టుగానే అతడిని చంపాలని వారు కోరుతున్నారు.