Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు అన్నీ అనుకూల పవనాలే....అడ్వాంటేజ్ తీసుకోగలరా ?

  • వచ్చే ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు వీస్తున్నట్లే కనిపిస్తోంది.
  • రేవంత్ రెడ్డి రూపంలో తెలుగుదేశంపార్టీలో మొదలైన ముసలం జగన్ కు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయ్.
  • వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు పెట్టుకోబోతోందని జరుగుతున్న ప్రచారమే అందుకు కారణం.
  • వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటే ఏపిలో టిడిపి పరిస్ధితి ఎలాగుంటుంది?
Positive signs for ys jagan before padayatra and next elections

వచ్చే ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు వీస్తున్నట్లే కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి రూపంలో తెలుగుదేశంపార్టీలో మొదలైన ముసలం జగన్ కు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు పెట్టుకోబోతోందని జరుగుతున్న ప్రచారమే అందుకు కారణం.

రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమైపోయిందని, కాకపోతే ఎన్నికలకు ఇంకా చాలా కాలముంది కాబట్టే అధికారికంగా బయటకు చెప్పటం లేదని టిటిడిపి నేతలే చెబుతున్నారు. ఆ విషయంగానే రేవంత్ కు పార్టీ అధిష్ఠానానికి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది.

సరే, టిడిపిలో మొదలైన ముసలం జగన్ కు ఏ విధంగా కలసి వస్తుంది? అంటే, సమైక్య రాష్ట్రాన్ని చీల్చిందే కెసిఆర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మెజారిటీ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా అడ్డుగోలుగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చింది. అందుకే ఏపిలో కాంగ్రెస్ ను పోయిన ఎన్నికల్లో భూస్ధాపితం చేసారు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటే ఏపిలో టిడిపి పరిస్ధితి ఎలాగుంటుంది?

ఏపిలో తన మార్కు పాలనను చూపించటంలో చంద్రబాబు విఫలమైంది వాస్తవం. అందుకే సానుభూతి కోసం ఇప్పటికీ అడ్డుగోలు రాష్ట్ర విభజన వాదన వినిపిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అటువంటిది అదే టిఆర్ఎస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఏపి జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారురో ?

పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పైన చూపించినట్లుగానే వచ్చే ఎన్నికల్లో టిడిపి పైనా అదే  ఆగ్రహాన్ని చూపిస్తే చంద్రబాబు పరిస్ధితేంటి ? టిఆర్ఎస్ తో పొత్తును చంద్రబాబు ఏపిలో ఏ విధంగా సమర్ధించుకుంటారు ? పైగా తెలంగాణాలో కూడా టిడిపి పరిస్ధితి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయటం కష్టం.

సరే, టిడిపి విషయాన్ని పక్కన పెడితే జరుగుతున్న పరిణామాలను జగన్ ఏ మేరకు అనుకూలంగా మలుచుకుంటారన్నదే పెద్ద ప్రశ్న. నవంబర్ 2వ తేదీ నుండి జగన్ పాదయాత్ర మొదలు కానున్న సంగతి తెలిసిందే కదా? ఇపుడు టిడిపిలో జరుగుతున్న పరిణామాలను కూడా జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఉపయోగించుకోవచ్చు.

ఏపిలో అధికారపార్టీలోని కీలక నేతల్లో అత్యధికులు కెసిఆర్ టచ్ లో ఉండటం ద్వారా ఏ విధంగా లబ్దిపొందుతున్నారన్న విషయాన్ని పాదయాత్రలో ప్రస్తావిస్తే చాలు. అందుకవసరమైన మెటీరియల్ ను ఎలాగూ  రేవంత్ రెడ్డే అందించారు జగన్ కు. పాదయాత్ర సమయానికి ఇంకేమి పరిణామాలు సంభవిస్తాయో టిడిపిలో. ఇంతకన్నా అనుకూలమైన పవనాలు జగన్ కు ఇంకేమి కావాలి?

Follow Us:
Download App:
  • android
  • ios