ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు సినీనటుడు పోసాని కృష్ణ మురళి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌పై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని పోసాని మండిపడ్డారు.

ప్రజలకు ప్రభుత్వంపై కోపం వుంటే ఓటుతో సమాధానం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. రాళ్లు రువ్వి దాడులు చేయాలని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారని కృష్ణ మురళి ఆరోపించారు.

రాంగ్ రూట్లో వెళ్లి చంద్రబాబు ఈ పరిస్ధితి తెచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవాల్సిన అవసరం లేదని పోసాని స్పష్టం చేశారు.

ఏ ఉద్యమమైనా ప్రజలు రగిలిపోతేనే వస్తుందని.. జగన్ జైలుకి వెళ్లాడు, ఇక అంతా తానే అని చంద్రబాబు అనుకున్నారని కృష్ణమురళి సెటైర్లు వేశారు.

పోతే సైనికుడు పోతాడు, వస్తే రాజ్యం వస్తుంది అనేది చంద్రబాబు పాలసీ అంటూ పోసాని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన మాటలు టీడీపీ వాళ్లు వినడం లేదని పోసాని అభిప్రాయపడ్డారు.