తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాశనం కావడానికి అతడి తల్లి నారా భువనేశ్వరినే కారణమని సంచలన కామెంట్స్ చేశారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాశనం కావడానికి అతడి తల్లి నారా భువనేశ్వరినే కారణమని సంచలన కామెంట్స్ చేశారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని చెప్పుకొచ్చారు. వారి మాటలు విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. చంద్రబాబుకు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టిందని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
అంత సాహసం చేసి చంద్రబాబును పార్టీలోకి తీసుకొస్తే.. ఆయనే ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించారని విమర్శించారు. తండ్రిపై చంద్రబాబు చెప్పులు వేయించినా భువనేశ్వరి చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లు అవినీతి చేశారని, మోసాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణే లెక్కలు చెప్పారని.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తామని అనడం ఏమిటో అర్థం కాలేదని అన్నారు.
చంద్రబాబు, లోకేష్‌లను పవన్ కల్యాణ్ తిట్టిన విషయం భువనేశ్వరి, బ్రాహ్మణిలకు తెలుసునని.. కానీ అతడిని పక్కనే కూర్చొబెట్టి టీ, కాఫీలు ఇస్తున్నారని పోసాని కృష్ణమురళి విమర్శించారు.
