2019 లో ఎక్కడినుండి పోటీ చేస్తారు?

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలిపారు పోసాని. 

ముక్కుసూటిగా మాట్లాడే నటుడు పోసాని కృష్ణమురళి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలైనా.. సమకాలీన రాజకీయాలైనా.. నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు పోసాని. 

జగన్, పవన్ లలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారని సదరు జర్నలిస్టు ప్రశ్నించగా.. జగన్ కే ఎక్కువ మార్కులు వేస్తానన్నట్లుగా ఆయన స్పందించారు. తనను ఎవరెంత ప్రలోభపెట్టినా.. డబ్బు, పదవి ఆశ చూపినా.. ఏం చేసినా సరే.. తన ఓటు మాత్రం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికేనని కుండ బద్దలు కొట్టారు. 

ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తిరుగు ఉండదని, తన వ్యక్తిత్వమే అలాంటిదని పోసాని పేర్కొన్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీ గాలి వీస్తుందని పోసాని బలంగా నమ్ముతున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో జనసేన ప్రభావం అసలేమి ఉండబోదనేది ఆయన మాటల ద్వారా వెల్లడవుతోంది. 

అయితే పాదయాత్రలో కలుకున్న పోసాని 2019 లో ఎక్కడనుండైన పోటీ చేస్తారా .పార్టీకి సపోర్ట్ చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది .