Asianet News TeluguAsianet News Telugu

పొన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

పొన్నూరు :  గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం టిడిపికి కంచుకోట. టిడిపి ఏర్పాటు నుండి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ తెలుగు దేశం పార్టీదే గెలుపు... మధ్యలో ఓసారి కాంగ్రెస్, గత అసెంబ్లీ ఎన్నికల్లో  వైసిపి విజయం సాధించింది. ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా కిలారి రోశయ్య కొనసాగుతున్నారు. అయితే టిడిపి కంచుకోటను బద్దలుగొట్టిన రోశయ్యను కాకుండా ఈసారి మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి పొన్నూరు  టికెట్ దక్కింది. ఇక టిడిపి నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోసారి బరిలోకి దిగారు.  

Ponnur assembly elections result 2024 AKP
Author
First Published Mar 6, 2024, 4:49 PM IST

పొన్నూరు అసెంబ్లీ రాజకీయాలు : 

పొన్నూరు రాజకీయాలను గత మూడు దశాబ్దాలుగా ధూళిపాళ్ల కుటుంబమే శాసిస్తోంది. మొదట కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల వీరయ్య 1982 లో టిడిపి ఆవిర్భావం తర్వాత పార్టీ మారారు. ఇలా 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి తిరిగి పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని వరుసగా ఐదుసార్లు (1994-2019) పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసారు.  కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య చేతిలో తొలిసారి ఓడిపోయారు. 

పొన్నూరు నియోజకవర్గంలోని మండలాలు :

1. పొన్నూరు 
2. చేబ్రోలు
3. పెదకాకాని

పొన్నూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :

పొన్నూరు అసెంబ్లీ  వైసిపి అభ్యర్థి : 

పొన్నూరు నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టిడిపి బ్రేక్ వేసారు కిలారి రోశయ్య. 2019 ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకు రెండోసారి అవకాశం ఇవ్వలేదు వైసిపి అదిష్టానం. ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి అంబటి మురళిని పొన్నూరు ఎమ్మెల్యే బరిలో నిలిపింది వైసిపి.  మంత్రి అంబటి రాంబాబు సోదరుడే ఈ అంబటి మురళి. 

పొన్నూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి : 

పొన్నూరు అసెంబ్లీలో ధూళిపాళ్ల నరేంద్ర నే మరోసారి బరిలోకి దింపుతోంది టిడిపి. ఇప్పటికే ఐదుసార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ మిస్సయ్యారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన ఆయనను 2024 ఎన్నికల్లో టిడిపి సీటు దక్కింది.  


పొన్నూరు నియోజకవర్గ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం) : 

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,28,234

పురుషులు 1,10,398

మహిళలు 1,17,818


పొన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో 1,90,849 (83 శాతం) ఓట్లు పోలయ్యాయి. 

వైసిపి - కిలారి వెంకట రోశయ్య - 87,570 (45.88 శాతం) - 1,112 మెజారిటీ - విజయం 

టిడిపి - ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ - 86,458 (45.3 శాతం) ఓటమి 

జనసేన - బోణి పార్వతి ‌- 12,033 (6.3 శాతం) - మూడో స్థానం  

 పొన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 : 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2014 లో పొన్నూరు ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,76,251 (84 శాతం) ఓట్లు పోలయ్యాయి.  

టిడిపి - ధూళిపాళ్ల నరేంద్ర - 88,386 (50 శాతం) - 7,761 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - రావి వెంకట రమణ - 80,625 (45 శాతం) ‌‌- రెండోస్థానంతో ఓటమి 
 

Follow Us:
Download App:
  • android
  • ios