శ్రీకాకుళం: కేసు లేకుండా చేయడానికి ఓ ఎస్సై దారుణమైన బేరం పెట్టాడు. నీ కూతురిని నా ఇంటికి పంపిస్తే కేసు గురించి ఆలోచిస్తానని శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్సై ఓ వ్యక్తితో బేరమాడాడు. అతని కూతురితో కూడా అతను మాట్లాడాడు. ఈ ఫోన్ సంభాషణలు లీకయ్యాయి. దాంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగుతోంది.

వివరాలు ఇలా ఉన్నాయి.... ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలోని పోలీసులు తుంగపేటకు చెందిన అప్పారావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 48 మద్యం సీసాలు బయటపడ్డాయి. దాన్ని ఆసరా చేసుకుని మహిళను లైంగిక వేధించడం ప్రారంభించాడు.

నీ కూతురిని నా ఇంటికి పంపిస్తే కేసు నమోదు చేసే విషయంపై ఆలోచన చేస్తానని రామకృష్ణ షరతు పెట్టాడు. లేదంటే కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. తన ఇంటికి రావాలని రామకృష్ణ మహిళను కూడా వేధించడం ప్రారంభించాడు.  

ఎస్సై రామకృష్ణ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది, దాంతో వారు ఆరా తీశారు. ఎస్సై రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళతో ఎస్సై మాట్లాడిన మొబైల్ సంభాషణలు వైరల్ అవుతున్నాయి.

"