క్రాస్ ఓటింగ్ భయం రెండు పార్టీల నేతల్లోనూ ఆందోళన పెంచేస్తోంది.
స్ధానికి ఎంఎల్సీ సమరం మొదలైంది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎంఎల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. పార్టీలు తమ ఓటర్లను క్యంపుల నుండి నేరుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు తెస్తున్నారు. నెల్లూరులో 5, కడపలో 3, కర్నూలులో 3 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నెల్లూరులో 844 ఓట్లుండగా, కడపలో 845, కర్నూలు 1084 ఓట్లున్నాయి. ఇన్ని రోజులు పార్టీలు, అభ్యర్ధలు పడిన టెన్షన్ కు నేటి సాయంత్రం 4 గంటలకు తెరపడుతుంది.
నెల్లూరులో టిడిపి తరపున వాకాటి నారాయణరెడ్డి, వైసీపీ అబ్యర్ధిగా ఆనం విజయకుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. కడపలో వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి, టిడిపి తరపున బిటెక్ రవి పోటీ పడుతున్నారు. కర్నూలులో టిడిపి తరపున శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ తరపున గౌరు వెంకట్రెడ్డి బరిలో ఉన్నారు. క్రాస్ ఓటింగ్ భయం రెండు పార్టీల నేతల్లోనూ ఆందోళన పెంచేస్తోంది. 20వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడుతాయి. మూడు స్ధానాలను ఇటు టిడిపి అటు వైసీపీలు ప్రతిష్టగా తీసుకోవటంతో అందరిలోనూ టెన్షన్ తారాస్ధాయికి చేరుకుంది.
