YSR Congress Party: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రుల కౌంటర్
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ఏపీలో సంచలనమయ్యాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని చెప్పడంపై మంత్రులు అంబటి, అమర్‌నాథ్‌లు కౌంటర్లు ఇచ్చారు.
Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు. ఏపీలో ప్రతిపక్ష కూటమిదే గెలుపు అని అంచనా వేశారు. సీఎం జగన్ ప్యాలెస్‌లో కూర్చుని సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. అలా పంచడం వల్ల ప్రజలు ఓటు వేస్తారని భ్రమిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా కనిపిస్తేనే ప్రజలు కన్విన్స్ అవుతారని వివరించారు. అంతేకాదు, ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఈ సారి జగన్ ఏమి చేసినా గెలవడం కష్టమేనని తెలిపారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. నాడు లగడపాటి కూడా ఇలాగే అంచనాలు వేసి సన్యాసం తీసుకున్నాడని, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వంతు అని అన్నారు. ప్రశాంత్ కిశోర్ అంచనాలు తప్పుతాయని చెప్పారు.
Also Read: ప్యాలెస్‌లో కూర్చొని డబ్బులు పంచితే ఓట్లు రాలవు.. ఈసారి జగన్‌కు ఓటమి తప్పదు : ప్రశాంత్ కిశోర్ సంచలనం
మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా ప్రశాంత్ కిశోర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ సర్వేలు ఏపీకి సంబంధించి నిజం కాబోవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైనా విమర్శలు చేశారు. ఒక్క పీకే (పవన్ కళ్యాణ్) సరిపోడని, మరో పీకే (ప్రశాంత్ కిశోర్)ను తెచ్చుకున్నాడని ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిశోర్‌తో చంద్రబాబు రెండు మూడు గంటలపాటు భేటీ అయ్యారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.