సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియాలో సెటైర్లు వేశారు. పవన్ ఓ గందరగోళ రాజకీయ నాయకుడు అంటూ విమర్శించడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత జనసేన పోటీచేయాలని భావించింది. తమ పార్టీ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది. అయితే.. అనంతరం వెంటనే ఈ విషయంలో పవన్ యూటర్న్ తీసుకున్నారు. దీంతో.. పవన్ పై పొలిటికల్ సెటైర్లు ఎక్కువయ్యాయి.

కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. పక్క రాష్ట్రంలో కూడా సెటైర్లు వేయడం గమనార్హం. గందరగోళ రాజకీయవాదిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని శుక్రవారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ మురసు’ ఓ కథనాన్ని ప్రచురించింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ దళిత విభాగం జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణన్‌లను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కలుసుకున్న తరువాత తమ పార్టీ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీచేయడం లేదు, బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేగాక తమ పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా వ్యవహరించారు.  (బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు)

2019 పార్లమెంటు ఎన్నికల్లో  బహుజనసమాజ్‌ పార్టీ కూటమిలో చేరగా ఆ పార్టీ కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. తరువాత కొద్ది నెలల్లోనే మాయావతి కూటమికి స్వస్తి పలికి ప్రస్తుతం బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో పవన్‌ను ‘గందరగోళ రాజకీయ నేత అని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు’  అని కథనం రాయడం తీవ్ర వివాదాస్పదానికి దారి తీసింది.