సర్వేలన్నీ భోగస్సే

Political analyst says he has not done any survey so far
Highlights

తాను ఇంతవరకూ ఎటువంటి సర్వేలూ చేయించలేదని స్పష్టం చేసారు. పార్టీ పరిస్ధితిపై తాను ఇంతవరకూ అధ్యయనం కూడా చేయలేదన్నారు. తాను సర్వేలు చేయించాని జరుగుతున్న ప్రచారమంతా భోగస్ గా వ్యూహకర్త తేల్చేసారు. మేమింకా తమ పనిని అసలు మొదలేపెట్టలేదని చెప్పటం గమనార్హం.

‘తాము రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎటువంటి సర్వేలు చేయలేద’ని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసారు. వైసీపీ ప్లనరీ జరుగబోతున్న నేపధ్యంలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో అధ్యక్షుడు జగన్మహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ను జిల్లాల అధ్యక్షులు, సీనియర్ నేతలు, పార్టీ కార్యవర్గానికి పరిచయం చేసారు. వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ ను జగన్ వినియోగించుకుంటున్నారని ఇంత వరకూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే కదా?

మొదటిసారిగా ప్రశాంత్ ను జగన్ నేతలకు పరిచయం చేసారు. ప్రశాంత్ ను వ్యూహాత్మకంగానే జగన్ పరిచయ కార్యక్రమం చేసినట్లు సమాచారం. సరే వ్యూహాలేవైనా సమావేశంలో తనను తాను పరిచయం చేసుకున్న ప్రశాంత్ తన పనితీరు ఏ విధంగా ఉండబోతోందో వివరించారు. అదే సందర్భంగా ప్రశాంత్ వైసీపీ పరిస్థితిపై సర్వే చేసారని, జగన్ కు షాక్ లిచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని పలువురు ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్ళారు. కొన్ని పచ్చ పత్రికల్లో ప్రశాంత్ సర్వేల పేరుతో వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అదే విషయమై మట్లాడుతూ, తాను ఇంతవరకూ ఎటువంటి సర్వేలూ చేయించలేదని స్పష్టం చేసారు. పార్టీ పరిస్ధితిపై తాను ఇంతవరకూ అధ్యయనం కూడా చేయలేదన్నారు. తాను సర్వేలు చేయించాని జరుగుతున్న ప్రచారమంతా భోగస్ గా వ్యూహకర్త తేల్చేసారు. మేమింకా తమ పనిని అసలు మొదలేపెట్టలేదని చెప్పటం గమనార్హం. ఇప్పుడిప్పుడే తాము కార్యక్షేత్రంలోకి దిగుతున్నామని వివరించారు.

క్షేత్రస్ధాయిలో ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తామని కూడా తెలిపారు. పైగా సర్వేలు చేయటమే తమ పని కాదన్న ప్రశాంత్ అవసరమైతే సర్వేలు కూడా చేస్తామన్నారు. పార్టీ పరిస్ధితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధాన దృష్టి ఉంటుందని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.

loader