చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఒకే కారులో ఉండవల్లికి లోకేష్, పీకే .. ఏపీ రాజకీయాల్లో కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు . ఆయనతో పాటు షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకీ ఇప్పటికే రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. 

political analyst prashant kishor meets tdp chief chandrababu naidu ksp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే.. జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇప్పటికీ జగన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఐప్యాక్ సూచనలు తీసుకుంటూనే వుంటారు. అలాంటిది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నారా లోకేష్‌తో కలిసి శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అనంతరం టీడీపీ చీఫ్‌తో పీకే భేటీ అయ్యారు. ఆయనతో పాటు షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకీ ఇప్పటికే రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios