తెలుగుదేశం పార్టీ నాయకులు బిసి జనార్ధన్ రెడ్డిని శుక్ర, శనివారాలు పోలీసులు విచారించనున్నారు. 

కర్నూల్: వైసిపి నేతలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్టయిన టిడిపి నాయకులు బిసి జనార్ధన్ రెడ్డిని శుక్ర, శనివారాలు పోలీసులు విచారించనున్నారు. విచారణ నిమిత్తం జనార్ధన్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా అనుమతి లభించింది. ఆయనను కస్టడీలోకి తీసుకుని న్యాయవాది సమక్షంలో రెండు రోజులపాటు విచారించాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దీంతో ఆదోని సబ్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీసీ జనార్దన్‌రెడ్డి డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి విచారించనున్నారు.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్థరాత్రి బీసీ జనార్దన్ రెడ్డిని, ఆయన అనుచరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన వర్గీయులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేశారనే ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 2 గంటల సమయంలో పోలీసులు జనార్దన్ రెడ్డిని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. 

read more తాగి ఇంటిపైకి...రోడ్డుపై పోతుంటేకూడా...: బిసి జనార్ధన్ రెడ్డి భార్య ఆందోళన

 తొలుత కాటసాని రామిరెడ్డి అనుచరులు బీసీ జనార్నద్ రెడ్డి నివాసానికి వెళ్లినట్లు టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. ఆ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు పైపులతో కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.

తమ అనుచరులను కాటసాని రామిరెడ్డి అనుచరులు ఇంటి వద్దకు వచ్చి రెచ్చగొట్టారని బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు అందరూ చూస్తుండగానే పైపులతో తమపై దాడి చేశారని కాటసాని రామిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.