అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును గురువారం నాడు పోలీసులు అడ్డుకొన్నారు.

రాయపూడి సభకు వెళ్తుండగా  చంద్రబాబునాయుడును పోలీసులు అడ్డుకొన్నారు. సభ ప్రాంగణానికి కొద్ది దూరంలోనే బాబు కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేశారు.రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకొన్నారు. శంకుస్థాపన ప్రదేశానికి వెళ్తానని చంద్రబాబు పోలీసులకు చెప్పారు.

రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్తానని చంద్రబాబునాయుడు పట్టుబట్టారు. బాబును ఈ ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావులు అభ్యంతరం వ్యక్తం చేశారు.సభకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఆంక్షలు అమలు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.సభకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఆంక్షలు అమలు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.  మూడు రాజధానుల అంశాన్ని  విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

విపక్షాలు మాత్రం మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే  రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  రైతులు చేస్తున్న ఆందోళన ఏడాది పూర్తైన సందర్భాన్ని పూర్తి చేసుకొన్న సందర్భంగా  రాయపూడిలో సభను ఏర్పాటు చేశారు.