శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఖాకీలు...బాధ్యత మరిచి స్టేషన్‌లోనే నిత్యం పేకాట ఆడటంతో పాటు మద్యం మత్తులో చిందులు వేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల జరిగినది కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గర్లోని విజయవాడ నగరంలో.

భవానీపురం పోలీస్ స్టేషన్‌లోని బ్యారక్‌లో నిత్యం పేకాట ఆడటంతో పాటు మద్యం మత్తులో చిందులు వేస్తున్నారు. ఇదంతా ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు సమక్షంలోనే జరుగుతున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

పేకాట, మద్యం మత్తులో గార్డు విధులను పక్కనబెట్టడంతో పాటు, ఆయుధాలను సైతం పక్కనపడేశారు. వీరంతా వెంకటగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన పోలీసులుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.