కడప జిల్లాలో యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను అపహరించడంతో పాటు భారీ పేలుడుకు నిందితుడు కుట్రపన్నాడు. యువతిని కిడ్నాప్ చేసే సమయంలో ఇంట్లో పెట్రోల్ చల్లి రెండు గ్యాస్ సీలిండర్లు లీక్ చేశాడు.

Also Read:విజయవాడలో దారుణం: మైనర్ బాలిక కిడ్నాప్, రేప్

తద్వారా సీలిండర్ పేలి యువతి మరణించినట్లుగా చిత్రీకరించేందుకు నిందితుడు ప్లాన్ చేశాడు. దీనితో పాటు ఇంట్లో పుర్రెలు ఉంచాడు. నిందితుడిని ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కృష్ణమోహన్‌గా గుర్తించారు.

కిడ్నాప్‌ను ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో యువతితో పాటు కృష్ణమోహన్‌ను తమిళనాడు రాష్ట్రం వేలూరులో అదుపులో తీసుకున్నారు.

Also Read:మహిళ ఫోన్ తో బయటికి వచ్చిన చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య

యూట్యూబ్‌లో వీడియోలు చూసి కిడ్నాప్ ప్రణాళిక రూపొందించుకున్నానని నిందితుడు తెలిపాడు. అదే సమయంలో యువతి తనను ప్రేమించడం లేదనే అక్కసుతోనే కిడ్నాప్ చేశానని కృష్ణమోహన్ వెల్లడించాడు. దీనిపై డీఎస్పీ స్పందిస్తూ.. ఒకవేళ సిలిండర్ పేలి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగేదన్నారు.