మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

రాజకీయంగా ఆధిక్యత చాటుకునేందుకే భాస్కరరావును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మరికొందరిని సైతం విచారించే అవకాశ వుంది. గత నెల 29న నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు భాస్కరరావును హత్య చేయడం కలకలం రేపింది.

Also Read:మచిలీపట్నం వైసిపి నేత హత్య కేసు... ముగ్గురు నిందితుల అరెస్ట్

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ముగ్గురికి సంబంధం ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నానికి భాస్కరరావు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం.

హత్య చేసిన అనంతరం ఓ నిందితుడు బైక్ పై పరారవుతుండగా సీసీ కెమెరాలకు చిక్కారు. రోడ్డుపై సిద్ధంగా ఉన్న బైక్ ఎక్కి పరారయ్యాడు ఓ నిందితుడు. ఇలా నగరంలోని వివిధ సిసి టివి పుటేజిని సేకరించిన పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. వీరి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

Also Read:ముఖ్య అనుచరుడి దారుణ హత్య... మృతదేహం వద్ద బోరున విలపించిన మంత్రి నాని (వీడియో)

భాస్కరరావు ఛాతీలో పొడిచిన ఒకే ఒక్క పోటు బలంగా దిగడంతో  గుండెకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. నేరుగా గుండెకు గాయం కావటంతోనే భాస్కర రావు ప్రాణాలు విడిచారు.

మంత్రి పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన తొలి నుండి ఆయనతోనే వుంటూ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు భాస్కరరావు. అటువంటి అత్యంత సన్నిహితుడి దారుణ హత్య విషయం తెలుసుకుని మంత్రి చలించిపోయారు. తన హోదాను సైతం మరిచిపోయి బాగా ఎమోషన్ అయ్యారు