Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

పాలేశ్వరం ఘటనకు సంబంధించి టెక్కలి పోలీసులు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి నోటీసులు అందజేశారు గురువారంనాడు డిఎస్పీ ముందు విచారణకు హాజరు కావాలని సూచించారు.

Police serve notice to TDP AP president Atchennaidu
Author
Srikakulam, First Published Jan 28, 2021, 6:46 AM IST

శ్రీకుకాళం: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడికి పోలీసులు నోటీసు జారీ చేశారు. టెక్కలి పోలీసులు ఆయనకు 41ఏ నోటీసు ఇచ్చారు. విశాఖపట్నంలోి ఆయన నివాసానికి బుధవారం వెళ్లి నోటీసులు ఇచ్చారు. 

సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయం బయట నుంచి విగ్రహ ప్రతిష్టాపన ఘటనకు సంబంధించి కాశిబుగ్గ డిఎస్పీ ముందు గురువారం హాజరు కావాలని పోలీసులు ఆయనకు చెప్పారు. ఘటనలో పాల్గొన్నవారు ముందు రోజు అచ్చెన్నాయుడిని కలిశారని, అందుకు విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. 

పాలేశ్వరస్వామి ఆలయంలో చెట్టు కింద ఖాళీగా ఉన్న నంది విగ్రాహన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకుని వచ్చి వెలుపల ఉ్న ఓ దిమ్మెపై ప్రతిష్టించారు. దానిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఆ తర్వాత స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 16 మందిపై సంతబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో  పేర్లు ఉన్న కొంతంది మంది అచ్చెన్నాయుడిని కలిసి తర్వాతనే ఘటన జరిగిందని, అందుకే ఆయనను కూడా విచారించడానికి నోటీసులు ఇచ్చారని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios