విశాఖపట్టణంలోని సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రిలో కూడ పిల్లల అక్రమ రవాణా చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఆసుపత్రిలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి నుండి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రిలో కూడ పిల్లల అక్రమ రవాణా చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఆసుపత్రిలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి నుండి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు.
విశాఖపట్టణం నగరంలోని పలు ఆసుపత్రుల్లో కూడ పసిపిల్లల అక్రమ రవాణా చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖపట్టణంలోని యూనివర్శల్ సృష్టి ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 56 పసిపిల్లలను విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు.
విశాఖపట్టణంతో పాటు హైద్రాబాద్ లో కూడ ఇదే తరహాలో ఘటనలు చోటు చేసుకొన్నట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సృష్టి ఆసుపత్రి విశాఖ నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులతో లింక్ ఏర్పాటు చేసుకొందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
సృష్టి ఆస్పత్రిలో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా చేపట్టిన విచారణలో జాతీయ రహదారిపై అక్కయ్యపాలెం సమీపంలో ఉన్న పద్మశ్రీ ఆస్పత్రితో లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పద్మశ్రీ ఆస్పత్రిలో శనివారం తనిఖీలు నిర్వహించారు.
ఆస్పత్రి ఎండీ డాక్టర్ పద్మజను విచారించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసిపిల్లల అక్రమ రవాణా విషయంలో ఒక డెలివరీ పద్మశ్రీ ఆస్పత్రిలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
పసిపిల్లల అక్రమ రవాణా వ్యవహారంపై ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. సృష్టి ఆస్పత్రి డాక్టర్ నమ్రతతో పాటు పద్మజ ఆస్పత్రిపైనా కూడా 120బీ, 417, 420, 370, అలాగే సెక్షన్ 81, 77 జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఆస్పత్రులతోపాటు నగరంలో ఉన్న మరికొన్ని ఆస్పత్రుల ద్వారా కూడా పసికందుల అక్రమ రవాణా జరిగినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పద్మజ ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, పిల్లల అక్రమ రవాణాలో వీరి పాత్ర ఏంటనే అంశంపై పూరిస్థాయిలో దృష్టి సారించామని ద్వారక ఏసీపీ మూర్తి తెలిపారు. పద్మజ ఆస్పత్రిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేయలేదు. కొద్ది రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం. ఎంవీపీ ఇన్‌చార్జి సీఐ అప్పారావు, ఎస్‌ఐ సూర్యనారాయణ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుందని ఆయన తెలిపారు.
