కర్నూలు జిల్లాలో పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులోని పేకాట క్లబ్బులపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇవి ఉద్రిక్తతకు దారి తీశాయి.

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా రూ.2 కోట్లకు పైగా నగదు, 40 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు పేకాట రాయుళ్లను వదిలిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు క్లబ్ నిర్వాహకులు. అంతటితో ఆగకుండా పోలీసులపైకే తిరగబడ్డారు. గుమ్మనూరుకు రావడానికి ఎంత ధైర్యమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే సమయంలో పోలీసులను చూసి మరికొందరు పారిపోయారు.