శ్రీశైలం ఆలయ పరిధిలో పేకాట.. కానిస్టేబుల్, ఐదుగురు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు..
దేవాలయం, దేవాలయ ప్రాంగణాల్లో భక్తులు ఎంతో పవిత్రత పాటిస్తూ, నిష్టగా, నియమంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

దేవాలయం, దేవాలయ ప్రాంగణాల్లో భక్తులు ఎంతో పవిత్రత పాటిస్తూ, నిష్టగా, నియమంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే అటువంటి చోటే రక్షకభటులు నిబంధనలు అతిక్రమించి పేకాట ఆడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పవిత్రమైన శ్రీశైలం ఆలయ పరిధిలో చోటుచేసుకుంది. పవిత్రమైన శ్రీశైలం పుణ్య క్షేత్రం పరిధిలో పోలీసులు పేకాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతయుతమైన విధుల్లో ఉన్న పోలీసులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడటంపై భక్తులు మండిపడుతున్నారు.
అయితే ఈ ఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీ సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక కానిస్టేబుల్, ఐదుగురు హోం గార్డులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.