Asianet News TeluguAsianet News Telugu

ఆరుగురికే అనుమతి.. టీడీపీ నేతలు వందల మందితో వెళ్లారు, ఎస్పీ నేతృత్వంలో విచారణ: గుడివాడ ఘటనపై డీఐజీ

గుడివాడలో క్యాసినో (gudivada casino) వ్యవహారంపై నిజానిజాలను వెలుగు తీసేందుకు వెళ్లిన టీడీపీ నిజనిర్థారణ కమిటీని (tdp fact finding committee ) వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు

police officials serious on tdp and ysrcp leaders clash in gudivada
Author
Gudivada, First Published Jan 21, 2022, 8:43 PM IST

గుడివాడలో క్యాసినో (gudivada casino) వ్యవహారంపై నిజానిజాలను వెలుగు తీసేందుకు వెళ్లిన టీడీపీ నిజనిర్థారణ కమిటీని (tdp fact finding committee ) వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నేడు జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై సర్కిల్ పోలీసులతో సమావేశమయ్యారు ఏలూరు రేంజ్ డీఐజీ (eluru range dig) కె.వి మోహన్ రావు, ఎస్పీ సిద్ధార్ద్ కౌషల్ (krishna district sp) .

అనంతరం డీఐజీ మాట్లాడుతూ.. నేడు గుడివాడలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని మోహన్ రావు సూచించారు. ఆరుగురు సభ్యులతో టిడిపి నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చాం, కానీ నిబంధనలు అతిక్రమించి వందలాది మందితో టిడిపి నాయకులు వచ్చారని ఆయన అన్నారు. గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ, చాకచక్యంగా అదుపు చేశారని డీఐజీ ప్రశంసించారు. నిబంధనలను అతిక్రమించి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వందలాది మందితో నిజ నిర్ధారణ కమిటీ వెళ్లడంలో, కుట్రకోణం ఉందా అన్న అంశంపై విచారణ ప్రారంభించామని కేవీ మోహన్ రావు తెలిపారు. 

గుడివాడలో జరిగిన ఘటనపై ఎస్పి నేతృత్వంలో కమిటీ విచారణ చేస్తుందని.. తనను గృహ నిర్బంధం చేయండి అన్న వర్ల రామయ్య, గుడివాడలో రాద్ధాంతం చేశారని డీఐజీ అన్నారు. నేడు పట్టణంలో జరిగిన ఘటనలో రెండు పార్టీలపై పోలీసులు సమానంగా వ్యవహరించారని మోహన్ రావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే, ఆరుగురు సభ్యులతో టిడిపి నిజనిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చామని.. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు. 

ఎస్పి సిద్దార్థ్ కౌశల్ (siddharth kaushal) మాట్లాడుతూ.. గుడివాడలో జరిగిన ఉద్రిక్త ఘటనలను అదుపు చేసేందుకు పోలీసులు వ్యక్తిగతంగా రిస్క్ తీసుకొని ఎంతో ప్రయత్నించారని ఆయన తెలిపారు. వంద శాతం పోలీసుల కృషి వల్లే వివాదం పెద్దది కాలేదని ఎస్పీ అన్నారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని.. హద్దులు మీరి రాజకీయ కోణంలో ప్రశాంతత చెడగొట్టే వారిపై చర్యలు తప్పవని సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. రాజకీయ పార్టీల ప్రయోజనాల కంటే ప్రజల భద్రత, ప్రశాంతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ పోలీసులు ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని జిల్లా ఎస్పీ ప్రశంసించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios