మంత్రి పేర్నినానిపై హత్యాయత్నాన్ని ఖండించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. నాని తల్లి దశదిన కర్మ లో భాగంగా ఆమె ఆదివారం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా దాడి ఘటనపై పేర్ని నానిని, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. అసలు నిందితులు ఎవరో వెంటనే తేల్చాలని పోలీసులను సుచరిత ఆదేశించారు.

Also Read:ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన సంచలనం సృష్టిస్తోంది. నాగేశ్వరరావు అనే తాపీమేస్త్రీ తాపీతో మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే మంత్రి అనుచరులు వెంటనే అప్రమత్తం అయి అడ్డుకోవడంతో మంత్రి క్షేమంగా బయటపడ్డారు.

అతను ఎందుకిలా చేశాడో నాకు తెలీదు. నేనైతే సురక్షితంగా ఉన్నా. అతను బలరాం పేటకు సంబంధించిన వ్యక్తి అని స్వయంగా మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.