మంగళగిరి మండలం లో నాటు సారా తయారి కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా మంగళగిరి మండలం నిడమర్రు, ఐనవోలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

Also Read:కరోనాతో సహజీవనం: కేటీఆర్ నోట వైఎస్ జగన్ మాట

ఈ క్రమంలో నాటు సారా తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు... వీరికి ఎవరెవరు సహకరిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా నిన్నటి వరకు మద్యం అందుబాటులో లేకపోవడంతో గ్రామ శివారు ప్రాంతాలను నాటుసారా తయారీకి వేదికగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

రానున్న కాలంలో మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు లాక్‌డౌన్‌ను సడలిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం వైన్‌షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు బారులు తీరారు.

Also Read:మద్యం దుకాణాల రీ ఓపెన్‌తో కరోనా వ్యాప్తి: చంద్రబాబు ఆందోళన

మంగళగిరిలో తెల్లవారుజాము నుంచే మద్యం ప్రియులు వైన్‌షాపుల ఎదుట క్యూకట్టారు. అటు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలను చేపట్టడానికి ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు.