గుంటూరు: గుంటూరు జిల్లా మెల్లంపూడిలో భార్గవ్ తేజ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో  పోలీసులు సంచలన విషయాలు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో మార్చి 14వ తేదీన భార్గవ్ తేజ అదృశ్యమయ్యాడు. మరునాడు ఇంటికి సమీపంలోని పొలాల్లో శవంగా తేలాడు.

మృతదేహంపై గాయాలున్నాయి. భార్గవ్ తేజను హత్య చేసి చంపారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అయితే భార్గవ్ తేజను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని బాధిత కుటుంబం ప్రశ్నించింది.భార్గవ్ తేజ్ తండ్రి భగవానియా నాయక్   ఓ యూనివర్శిటీలో ఎలక్ట్రీషీయన్ గా పనిచేస్తున్నాడు

భార్గవ్ తేజపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత అతడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో  గోపి అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

గత నెలన్నర క్రితం అదృశ్యమైన అఖిల్  అదృశ్యం కేసులో కూడ గోపిపై అనుమానాలున్నాయి.   అఖిల్ పై కూడ అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అఖిల్ కంటే ముందే మరో బాలుడి అదృశ్యం కేసులో కూడ గోపిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

లైంగిక దాడి తర్వాత భార్గవ్ తేజను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.విపరీత మనస్తతత్వం కల గోపి చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాత హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయమై గుంటూరు ఎస్పీ మీడియాకు వివరాలు వివరించే అవకాశం ఉంది.