ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించడడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. దీంతో ప్రజావేదికతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కలెక్టర్ల సమావేశం జరుగుతున్న సమయంలో బాబు నివాసంలో టీడీపీ ముఖ్యనేతలు సమావేశమై జగన్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రజావేదికను కూల్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తారన్న భావనతోనే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.  

కాగా సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న జగన్.. ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడమని, అక్రమాలు.. దుర్వినియోగాలకు వేదిగా ప్రజావేదిక మారిందని ఆరోపించారు. దీనిని ఎల్లుండిలోగా కూల్చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.