కరోనా మృతుడికి అంత్యక్రియలు: పారిశుద్య సిబ్బందిని అడ్డుకొన్న 10 మందిపై కేసులు

కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించినందుకు కాలనీలోకి రాకుండా పారిశుద్య సిబ్బందిని అడ్డుకొన్న 10 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.

police files crimininal cases against villagers who obstructed municipal staff in tekkali

శ్రీకాకుళం: కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించినందుకు కాలనీలోకి రాకుండా పారిశుద్య సిబ్బందిని అడ్డుకొన్న 10 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.

ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని హోలియాపుట్టి గ్రామంలో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలను ఆరుగురు పారిశుద్య కార్మికులు నిర్వహించారు. అయితే కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించిన పారిశుద్య కార్మికులను ఇళ్లలోకి రాకుండా టెక్కలిలోని అంబేద్కర్ కాలనీవాసులు అడ్డుకొన్నారు.

also read:కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు: ఇండ్లకు అనుమతించని కాలనీ వాసులు

రెండు రోజులుగా అంబేద్కర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ లోనే వారంతా గడిపారు.ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు పారిశుద్య కార్మికులను క్వారంటైన్ కు తరలించారు.

ఈ ఘటన తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. పారిశుద్య కార్మికులను ఇళ్లలోకి అడ్డుకొన్న అంబేద్కర్ కాలనీ వాసులు 10 మందిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు స్థానికులు 10 మందిపై క్రిమినల్  కేసులు పెట్టారు. 

ఐపీసీ 341, 188తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో వివక్ష చూపితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios