జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ డి.వి.రమణమూర్తి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.  కోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరు అధికారులపై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, సిఆర్పీసి 156 క్లాజ్ 3 కింద ఆదివారం ఎంవిపి స్టేషన్లో కేసు నమోదైంది.

2016లో యువతి ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది. అత్యవసర సాయం కింద బాధితురాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం అందచేయటంలో ఆలస్యం చేయడమే కాకుండా, సెక్షన్లను తారుమారు చేశారంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. దాంతో కేసును విచారించిన కోర్టు బాధితురాలి వాదనతో ఏకీభవించింది.  దాంతో కోర్టు ఆదేశాలతో ఎడిడిని ఎ1గా, కలెక్టర్ ను ఎ2గా పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదె చేశారు. ఒక ఐఏఎస్ అధికారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటం ఇదే మొదటిసారేమో.