విజయవాడలో సంచలనం కలిగించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య హత్య కేసులో నిందితుడు నాగేంద్రపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. దివ్యతో తనకు పెళ్లి జరిగినట్లు నాగేంద్ర పోలీసుల విచారణలో తెలిపాడు.

మంగళగిరిలో తాము పెళ్లి చేసుకున్నామని, దివ్య ఇంట్లోని కత్తితోనే హత్య చేశానని నాగేంద్ర చెప్పాడు. పోలీసులతో దివ్య తండ్రిని తిట్టిన తర్వాత నాగేంద్ర స్పృహ కోల్పోయాడు. ఏడు నెలలుగా వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి వ్యవహారం నడుస్తోంది.

ఈ క్రమంలో దివ్య తండ్రి, నాగేంద్రబాబు మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగేంద్రకు దివ్య తండ్రి నిన్న వార్నింగ్ ఇచ్చాడు. దివ్యకు దూరంగా ఉండాలని బెదిరించాడు.

దీనిని మనసులో పెట్టుకున్న ఇవాళ ఉదయమే ఇంటికి వచ్చి దివ్య గొంతు కోశాడు నాగేంద్ర. ఇదే సమయంలో దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు చీరకట్టి ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివ్య కూడా సూసైడ్‌కు యత్నించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.