విజయవాడ:కృష్ణా జిల్లాలోని పెడన మున్సిపల్ కమిషనర్ పై  బుధవారం నాడు  లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. 

తనను వేధిస్తున్నాడని ఓ మహిళా వర్కర్ మున్సిపల్  కమిషనర్ పై  మంగళవారం నాడు దాడికి ప్రయత్నించింది. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. బాధితురాలు మున్సిపల్ కమిషనర్ పై ఫిర్యాదు చేసింది.

ఈ విషయమై పోలీసులు విచారణ చేసి మున్సిపల్ కమిషనర్ పై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని  బాధిత మహిళ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

ఈ వేధింపులు తట్టుకోలేక తాను దాడికి ప్రయత్నించినట్టుగా ఆమె చెప్పారు.  మరికొందరు మహిళా వర్కర్లు కూడ  మున్సిపల్ కమిషనర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.  కమిషనర్ అంజయ్యపై  చర్యలు తీసుకోవాలని మహిళా వర్కర్లు మంగళవారం నాడు విమర్శలు గుప్పించారు. 

బాధిత మహిళ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయాలని పోలీసులు కోరుతున్నారు. బాధితుల పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీస్ శాఖ ప్రకటించింది.